స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-776లో.. మహేంద్ర ఢిల్లీ నుండి ఇంటికి వస్తాడు. అప్పుడు ఫణీంద్ర, దేవయాని, శైలేంద్ర, జగతి అందరూ హాల్లోనే ఉంటారు. ఢిల్లీలో మన కాలేజ్ గురించి చెప్తుంటే అందరూ ఆశ్చర్యపోయారు. రిషి గురించి చెప్తుంటే చాలా ఆసక్తిగా చూసారంటూ మహేంద్ర చాలా హ్యాపీగా చెప్తుంటాడు. కాసేపటికి ఈ లవ్ బర్డ్స్ రిషి, వసుధారలు ఎక్కడ అని మహేంద్ర అడుగుతాడు. అయినా ఎవరూ మాట్లాడరు.. కాసేపటికి దేవయాని కాలేజీలో రిషిపై మోపిన అభియోగం గురించి, అతడిని కాలేజీ నుండి తీసేసింది, అలాగే రిషి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడని చెప్తుంది. దాంతో ఒక్కసారిగా మహేంద్ర కుప్పకూలిపోతాడు. అందరూ దీనంగా చూస్తారు.
కాసేపటికి నేను చెప్పేది ఒకసారి విను మహేంద్ర అని జగతి అంటుంది. జగతిని ఇంకేం మాట్లాడకంటూ మహేంద్ర హైపర్ అవుతాడు. "నా రిషిని వెళ్ళగొట్టారా? నీకు మనసెలా వచ్చింది జగతి.. నీతి, నిజాయితీకి నిలువెత్తు రూపం నా రిషి.. మీ ఇద్దరిని నమ్మాడు కదా.. ప్రతీ విషయం మీతోనే షేర్ చేసాడు కదా.. ఎంత నమ్మక ద్రోహం చేసారు మీరిద్దరు.. రిషి గురించి నీకు తెలుసు కదా" అని జగతిని మహేంద్ర అడుగుతాడు. జగతి మౌనంగా ఉంటుంది. పక్కనే ఉన్న శైలేంద్ర మధ్యలో కలుగజేసుకొని.. చెప్పు పిన్ని నిన్నెవరైనా బెదిరించారా? లేక రిషిని చంపేస్తానని చెప్పారా? ఎందుకు ఇలా చేశారంటూ అడుగుతాడు. దాంతో జగతిని మహేంద్ర మళ్ళీ అడుగుతాడు. రిషిని మోసం చేసి కాలేజీ నుండి పంపించేంత బలమైన కారణం ఏం ఉంది అని అడుగుతాడు. రిషి బాగుకోసమే చేసానని జగతి అంటుంది. ఆ తర్వాతి జగతిని ఇంకా కొన్ని మాటలు అనేసి మహేంద్ర అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఫణీంద్ర భూషణ్ కూడా వెళ్ళిపోతాడు. ఇక హాల్లో జగతి, శైలేంద్ర, దేవయాని మిగులుతారు. బాబాయ్ మంచోడు కాబట్టి మొదట సీరియస్ ఐనా తర్వాత మిమ్మల్ని దీని వెనుక ఏం జరిగిందని మిమ్మల్ని అడుగుతాడు. ఒకవేళ మీరు నిజం చెప్తే బాబాయ్ ని మట్టిలో కలిపేస్తానని జగతితో శైలేంద్ర అంటాడు.
ఆ తర్వాత రిషి, జగతిల గురించి శైలేంద్ర తీవ్రంగా ఆలోచిస్తుంటాడు. అదే సమయంలో ఒక రౌడీ శైలేంద్ర కాల్ చేసి.. "మేం రిషిని చూసాం సర్" అని చెప్తాడు. దాంతో శైలేంద్ర.. వాడిని చంపేయండని వాళ్ళకి చెప్తాడు. సరేనని ఆ రౌడీలు రిషిని ఫాలో చేస్తుంటారు. అదే టైంలో కార్ రిపేర్ వచ్చి ఒక అమ్మాయి సాయం కోసం ఎదురుచూస్తుండగా రిషి చూస్తాడు. తన దగ్గరికెళ్ళి.. నేను చూడనా అని అడుగగా సరేనని రిషి చెక్ చేస్తుంటాడు. ఇంతలో ఆ అమ్మాయి.. మీరు రిషి కదా అని అంటుంది. మరి ఆ అమ్మాయి ఎవరు? రిషి ఆ అమ్మాయికి ఎలా తెలుసు.. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.